ముంబయి : మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్ లీక్‌కు సంబంధించిన కేసులో తాజాగా మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వీర్ని అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ర్ట అధికారులు ఆదివారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం నాడు ఆగ్రాకు చెందిన ఒక ప్రైవేట్ ప్రింటింగ్ సంస్థ ఉద్యోగులైన నరేష్‌కుమార్ మహోరే, సంజయ్‌కుమార్ శర్మ, బాబులాల్ కుష్వాహాలను అరెస్టు చేసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకూ మొత్తం పది మందిని అరెస్టు చేసినట్లు అధికారి చెప్పారు. తాజాగా అరెస్టయిన ముగ్గురూ పేపర్ ప్రింట్ అవుతున్న సమయంలోనే ఒక సురక్షిత కేంద్రం నుండి ప్రశ్నపత్రాలను అక్రమంగా బయటకు తరలించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. శర్మ నుంచి పోలీసులు మూడు లైవ్ కాట్రిడ్జ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిని థానే జిల్లాలోని భివండి(ఇక్కడే పేపర్ లీక్ వెలుగులోకి వచ్చింది) కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ వీరికి ఈ నెల 9 వరకు పోలీసు కస్టడీకి అనుమతించారు. కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న బిజేంద్ర కుమార్ గుప్తా, సోనుకుమార్ కిషన్‌లాల్‌లను అదుపులోకి తీసుకోవడానికి సిట్ ప్రస్తుతం ఆర్థిక, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తోందని అధికారి తెలిపారు. కాగా, ఈ టెట్ పరీక్ష గత నెల 27న జరగాల్సి ఉంది. అయితే పేపర్ లీక్ వార్త వెల్లడికావడంతో దీనికి ఒక రోజు ముందు పరీక్షను వాయిదా వేశారు. పేపర్ లీక్‌కు పాల్పడిన రాకెట్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానాలో విస్తరించి ఉందని సిట్ వెల్లడించింది. ఈ టెట్ పేపర్ లీక్ తో దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.
TET leak: యుపిలో మరో ముగ్గురిని అరెస్టు
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)