గైక్వాడ్ సెంచరీ, తిలక్ వర్మ అర్ధ సెంచరీలు
దంబుల్లా: శ్రీలంక పర్యటనలో భారత్-ఎ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 278 పరుగుల ఛేదనలో శ్రీలంక-ఎ 6వికెట్ల నష్టానికి 262 పరుగులతో గెలుపుకు చేరువైన జట్టును ఇండియా-ఎ బౌలర్లు ఫలితం తారు మారు చేశారు. టీమిండియా-ఎ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో లంకజట్టు మరో 7పరుగుల్లోపే చివరి 4 వికెట్లు కోల్పోయి ఆలౌట్ కాగా.. ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. _రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) _కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గైక్వాడ్ కు దక్కింది. 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి._
స్కోర్ బోర్డు…
ఇండియా-ఎ ఇన్నింగ్స్: ప్రభ్ సిమ్రన్ సింగ్ (సి)సమరవిక్రమ (బి)కరుణరత్నే 2, సూర్యవంశీ (సి)సహన్ (బి)షిరాజ్ 14, ప్రియాన్ష్ ఆర్యా (రనౌట్)ఫెర్నాండో/డిక్వెల్లా 32, గైక్వాడ్ (సి)ఫెర్నాండో (బి)సహన్ 101, తిలక్ వర్మ (బి)షిరాజ్ 60, ఆయుస్ బడోనీ (ఎల్ బి)గరుక సంకేత్ 24, సుయాన్ష్ షిండే (నాటౌట్) 26, అనుకుల్ రాయ్ (నాటౌట్) 1, అదనం 17. (50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 277 పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/16, 3/69, 4/219, 5/225, 6/271
బౌలింగ్: కరుణరత్నే 7-1-46-1, షిరాజ్ 9-0-67-2, సంకేత్ 8-0-49-1, ఫెర్నాండో 8-0-38-0, వనుజ సహాన్ 10-0-35-1, సహన్ అరఛింగే 4-1-18-0, విశ్వకాంత్ 4-0-23-0
శ్రీలంక-ఎ ఇన్నింగ్స్: డిక్వెల్లా (సి)అనుకుల్ రాయ్ (బి)బడోనీ 47, ఫెర్నాండో (సి)సూర్యవంశీ (బి)బడోనీ 45, నువాందు ఫెర్నాండో (స్టంప్)ప్రభ్ సిమ్రన్ సింగ్ (బి)విప్రాజ్ 8, సదీరా (సి)సుయాంశ్ షిండే (బి)అనుకుల్ రాయ్ 46, సహన్ (బి)కంబోజ్ 74, రవీందు (సి అండ్ బి)అనుకుల్ రాయ్ 1, ఛమీకా (సి)బడోనీ (బి)విప్రాజ్ 9, వనుజ (రనౌట్)గైక్వాడ్ 23, విజయ్ కాంత్ (ఎల్ బి)అర్షాద్ 5, షిరాజ్ (సి)విప్రాజ్ (బి)ఆర్షాద్ 0, సంకేత్ (నాటౌట్) 0, అదనం11. (48.5ఓవర్లలో ఆలౌట్) 269 పరుగులు.
వికెట్ల పతనం: 1/93, 2/99, 3/109, 4/187, 5/195, 6/237, 7/262, 8/269, 9/269, 10/269
బౌలింగ్: కంబోజ్ 6-0-47-1, అర్షాద్ ఖాన్ 4.5-0-24-2, అనుకుల్ రాయ్ 10-1-49-2, సుయాంశ్ షిండే 8-0-41-0, బడోనీ 10-0-46-2, విప్రాజ్ 8-0-46-2, తిలక్ 2-0-15-0.









కామెంట్‌లు (0)