రాత్రి 7.00గం||ల నుంచి ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్
బర్మింగ్ హామ్ : మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న _హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. అదే జోరుతో ఈ టీ20 ప్రపంచ కప్‌లోనూ బోణీ కొట్టాలని చూస్తోంది. ఇక పాకిస్తాన్‌తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, _హర్మన్‌ప్రీత్ కౌర్, రీచా ఘోష్‌లతో టాప్, మిడిలార్డర్ పటిష్టంగా ఉంది._భారతి ఫుల్మాలి వంటి ఫినిషర్ కూడా ఉండడం జట్టుకు కలిసొచ్చే ఆంశం. ఇక శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల త్రయంతో పాటు దీప్తి శర్మ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరంతా బంతిని తిప్పితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. _పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌తో పాటు నందని శర్మ, అరుంధతి రెడ్డి యువ పేసర్లు ఉన్నారు. మరోవైపు ఫామ్‌లో లేమితో పాకిస్తాన్ మహిళల జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ టోర్నీకి ముందు ఐర్లాండ్ వేదికగా జరిగిన ట్రైసిరీస్‌లో పాక్ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. ముఖా ముఖి పోరులో భారత్‌దే పై చేయి. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచ్‌లు విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది.
జట్లు(అంచనా)…
భారత మహిళలు: హర్మన్ ప్రీత్(కెప్టెన్), మంధాన, షెఫాలీ, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఫుల్మాలి, రీచా ఘోష్(వికెట్ కీపర్), శ్రీచరణి, రాధా యాదవ్, రేణుకా సింగ్.
పాకిస్తాన్ మహిళలు: ఫాతిమా సనా(కెప్టెన్), డయానా బేగ్, ఇరామ్ జావెద్, అలియా, అయేషా, మునీబా అలీ(వికెట్ కీపర్), నష్రా సంధు, ఫర్వేజ్, తుబా హసన్, సాదియా ఇక్బాల్, ఐమాన్ ఫాతిమా.









కామెంట్‌లు (0)