mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళలూ కప్ కొట్టాలి

11 జూన్, 2026

ipl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 11:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • - ఇంగ్లండ్ × శ్రీలంక పోటీతో ప్రారంభం
    - రాత్రి 11.00గం||లకు

లండన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ లో టీమిండియా టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత ఏడాది ఐసిసి వన్డే ప్రపంచకప్ ను చేజిక్కింంచుకున్న హర్మన్ ప్రీత్ సేనపై భారీ ఆశలున్నాయి. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో శుక్రవారం తలపడనుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో జూన్ 14న బర్మింగ్‌హామ్ వేదికగా ఆడనుంది. ఈ టోర్నీలో ఆడే 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ లోని ఒక్కో జట్టు మిగిలిన 5జట్లతో ఒక్కోసారి తలపడనుంది. గ్రూప్ లీగ్ దశ ముగిసిన అనంతరం టాప్-2లో నిలిచి రెండు జట్లు సెమీస్ కు చేరనున్నాయి. ఈ క్రమంలో ఈ టోర్నీకి ముందు కెప్టెన్ల ఫొటో షూట్ గురువారం నిర్వహించారు. టోర్నీ ప్రారంభానికి ముందే 2 లక్షల టికెట్లు అమ్ముడవడంతో మెగా ఈవెంట్‌పై భారీ అంచనాలున్నాయి. జూన్ 12 నుంచి 28వరకు లీగ్ దశ పోటీలు జరగనున్నాయి. 30, జులై 2 సెమీఫైనల్స్, జూలై 5న లార్డ్స్ వేదికగా మహిళల టి20 ప్రపపంచకప్ ఫైనల్ పోటీ జరగనుంది. గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నెదర్లాండ్స్. గ్రూప్ 2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా జరగనుండటం కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి ఒక కారణం. లండన్‌లో జరిగిన కెప్టెన్ల మీట్‌‌కు అభిమానులు ఎక్కువ మంది రావడంపై ఐసీసీ డైరెక్టర్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రిచర్డ్ థామ్సన్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్ భవిష్యత్తులో ఎలా ముందుకు సాగుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన కొనియాడారు.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్