రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో ప్రత్యేకంగా ఓ కొత్త భాషను రూపొందిస్తున్నట్లు సమాచారం. గుహ గోడలపై ఉన్న రాతల్లోని రహస్యాన్ని ఛేదించేందుకు కథానాయకులు ఆ భాషను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పదాలు, వాక్య నిర్మాణం, లిపితో సహా పూర్తి భాషను అభివృద్ధి చేసేందుకు ఓ భాషా నిపుణుడిని నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
‘వారణాసి’లో కొత్త భాష
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)