పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వెట్టువం’లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సూర్య ‘విక్రమ్’లో పోషించిన రోలెక్స్ పాత్ర తరహాలో, ఈ సినిమాలోనూ దుల్కర్ పాత్ర కథను మలుపు తిప్పనుందని ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్ర చిత్రీకరణ కోసమే షూటింగ్‌ను మరో మూడు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది. ఆర్య, శోభితా ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం నటీనటులు యుద్ధ కళల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. పా. రంజిత్ తన సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘వెట్టువం’లో దుల్కర్ సల్మాన్?
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)