గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇళయరాజాకు అరుదైన గౌరవం

1 రోజు క్రితం

ఇళయరాజాకు అరుదైన గౌరవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 06:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఆస్ట్రేలియా పార్లమెంటు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. తనకు దక్కిన ఈ గౌరవంపై ఇళయరాజా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో మాట్లాడుతున్న ప్రసంగ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ వీడియోకు జతగా ‘నా 50 ఏళ్ల ప్రస్థానాన్ని స్మరించుకుంటూ తపాలా బిళ్ళను విడుదల చేసినందుకు విక్టోరియన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి, ఎంపి ఎన్వర్ ఎర్డోగాన్ కి, పార్లమెంట్ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తమిళనాడులోని ఒక చిన్న, మారుమూల గ్రామంలో జన్మించి, ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో గౌరవాన్ని అందుకోవడం నిజంగా హృదయానికి హత్తుకునే విషయం. ఈ సందర్భంగా నా సంగీతానికి జీవం పోసినవారికి, నాకు తోడుగా నిలిచిన కళాకారులకు, నా స్వరకల్పనలను ఆదరించిన తరతరాల శ్రోతలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను` అని ఆయన అన్నారు. ​

ఇదిలా ఉండగా ఇళయరాజా ఇటీవల సంగీతం అందించిన మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో పోటీ కోసం భారత్‌ తరఫున అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్