నటుడు ఆది సాయికుమార్‌కు సామాజిక మాధ్యమాల్లో చేదు అనుభవం ఎదురైంది. ‘ఇండియా ఫ్లిక్’ అనే ఖాతా నుంచి ఆయన కెరీర్‌ను కించపరిచేలా ఓ వ్యాఖ్య వెలువడింది. పరిశ్రమలో తాను షార్ట్స్ వేసుకునే దశ నుంచి ఎదిగానని, ఇప్పుడు ప్యాంట్స్ వేసుకుంటున్నానని, ఆది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారని.. ఇటీవల పరిశ్రమలోకి వచ్చిన యూట్యూబర్ మౌలికకు ఉన్నంత మార్కెట్ కూడా ఆయనకు లేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై ఆది సాయికుమార్ స్పందిస్తూ ప్రతి హీరో వెనుక ఓ కథ, ఎన్నో పోరాటాలు ఉంటాయని అన్నారు. తన తండ్రి కూడా ఎన్నో ఏళ్లు కష్టపడ్డారని, నాని, రవితేజ వంటి నటులు సైతం సుదీర్ఘకాలం శ్రమించారని గుర్తుచేశారు. అంతమాత్రాన వారు కుంగిపోలేదని, ప్రతి నటుడి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సహజమని పేర్కొన్నారు. ఇతరులను కించపరచడం కంటే ప్రోత్సహించడం నేర్చుకోవాలని సూచించారు. సినిమా ఓ ప్రయాణమని, అందులో విజయాలు, అపజయాలు సహజమని అన్నారు. ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని, కష్టాన్ని గౌరవించాలని కోరారు.
Print Editionకించపరచకుండా.. ప్రోత్సహించండి
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)