శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్‌ 4న ‘అలియాస్‌ రుక్మిణీ’

7 గంటల క్రితం

డిసెంబర్‌ 4న ‘అలియాస్‌ రుక్మిణీ’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ డిసెంబర్‌ 4న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నితిన్‌ ప్రైవేటు ఉద్యోగిగా కనిపించారు. రుక్మిణీ పాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. సెప్టెంబర్‌ 13న ఆమెను పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాని నిర్మిస్తున్నారు. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్