గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై అల్లు అర్జున్‌ ప్రశంసలు

2 గంటల క్రితం

allu.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్ 2’ సినిమాపై టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించాడు. రజనీకాంత్‌ స్టార్‌డమ్‌, స్టైల్‌, ఆరా ఈ సినిమాలో అద్భుతంగా కనిపించాయని కొనియాడాడు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు.
ఈ మేరకు అల్లు అర్జున్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. “రజనీ సార్‌ స్టార్‌డమ్‌, స్వాగ్‌, ఆరాకు ‘జైలర్ 2’ నిజమైన నిదర్శనం. సినిమా ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. అనిరుధ్‌ అదరగొట్టాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం తమ హృదయాలను పెట్టి పనిచేశారు. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ అద్భుతమైన హిట్‌ అందించాడు. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజనీగారికే సాధ్యం” అని ప్రశంసించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్