వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన సిరీస్ ‘నా వైఫ్ మిస్సింగ్’. ఈ నెల 22 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు మంగళవారం ఈ సిరీస్‌లోని ‘అరెరె వినవా’ పాటను విడుదల చేశారు. ‘టైటిల్‌తోనే ఈ సిరీస్ చూడాలనే ఆసక్తి కలుగుతోంది. పాట చాలా బాగుంది. సాయి కార్తీక్ ఆకట్టుకునేలా స్వరాలు సమకూర్చారు’ అని ఆయన ప్రశంసించారు. దర్శకురాలిగా పరిచయమవుతున్న స్వాతి, నిర్మాత శివకంఠంనేని, ఆయన స్నేహితులకు ఈ సిరీస్ మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కథాంశాలున్న కంటెంట్‌ను ఆహా ప్రోత్సహించాలని సూచించారు. స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘అరెరె వినవా’ పాటకు శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
‘అరెరె వినవా’ పాట విడుదల
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)