చెన్నయ్ : ప్రయివేటు రంగంలోని సిటీ యూనియన్ బ్యాంక్ (సియుబి) 556 రోజుల నుండి 3 సంవత్సరాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. ఈ నూతన సవరణ ప్రకారం 556 రోజుల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా ఏడాదికి 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, అలాగే సాధారణ డిపాజిటర్లకు 7.30 శాతం చొప్పున వడ్డీ లభించనుందని పేర్కొంది. ఖాతాదారుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తూ, సురక్షితమైన బ్యాంకింగ్ పరిష్కారాల ద్వారా పోటీతత్వ రాబడులను అందించే లక్ష్యంతోనే ఈ సవరణ చేపట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది. నియమనిబంధనలకు లోబడి త్వరలోనే ఈ నూతన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
Print Editionసిటీ యూనియన్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్ల పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)