బకాయిలు చెల్లించాలని డిమాండ్
న్యూఢిల్లీ : స్పైస్‌జెట్ సంస్థలో వేతనాల చెల్లింపుల జాప్యంపై సుమారు 40 మంది క్యూ400 విమాన పైలట్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. పెండింగ్ జీతాలు, ఇతర బకాయిలు చెల్లించే వరకు విమానాలు నడపబోమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పైలట్ల సంఘం ఆల్పా ఇండియా అక్టోబర్ 9న సభ్యులకు రాసిన లేఖలో ఆందోళనకు మద్దతు తెలిపింది. విమానాల నిర్వహణ, సరఫరాదారులకు చెల్లింపుల్లో జాప్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్లేన్స్‌పాటర్స్.నెట్ వివరాల ప్రకారం.. సంస్థకు చెందిన 37 విమానాలు నిలిచిపోగా, 10 విమానాలు మాత్రమే సేవల్లో ఉన్నట్లు పేర్కొంది.








కామెంట్‌లు (0)