సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘దాదా’గా బాలకృష్ణ

1 గంట క్రితం

balayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ‘ఎన్‌బీకే111’ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లోనే బాలకృష్ణకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకొని వచ్చే నెల తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘గాడ్‌’ లేదా ‘దాదా’ అనే టైటిళ్లను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తోంది. హీరో మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్