కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 3’ రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘భారతీయుడు 3: వార్ మోడ్’ పేరుతో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘సేనాపతి పునరుత్థానం మొదలవబోతోంది.. ఈసారి ఎవ్వరినీ ఉపేక్షించడు..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘భారతీయుడు 2’ తర్వాత మూడో భాగంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
‘భారతీయుడు 3’ వస్తాడు!
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)