శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లైక్‌తో వివాదంపై దీపిక స్పష్టత

1 గంట క్రితం

dipika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ చిత్రంలో తొలుత దీపికా పదుకొనే కథానాయికగా ఎంపికయ్యారు. అయితే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్నారు. దీపిక తప్పుకోవడానికి కారణాలపై చిత్ర నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఇటీవల స్పందిస్తూ, ఆమె భారీ పారితోషికంతో పాటు లాభాల్లో 10 శాతం వాటా కోరారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ స్పందిస్తూ, హీరోలు లాభాల్లో వాటా కోరితే విమర్శించకుండా, మహిళా నటులు కోరినప్పుడు విమర్శించడం పురుషాధిక్య ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. దీపిక ఆ పోస్టుకు లైక్‌ కొట్టడంతో, ఆమె ఆ అభిప్రాయాన్ని సమర్థించినట్లుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్