శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొరియన్ ‘షూఆల్స్’తో అమోర్ ఆసుపత్రి ఒప్పందం

1 గంట క్రితం

korea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ​దక్షిణ కొరియాకు చెందిన హెల్త్-టెక్నాలజీ సంస్థ ‘షూఆల్స్’తో అమోర్ ఆసుపత్రి వ్యూహాత్మక క్లినికల్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమోర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి, షూఆల్స్ వ్యవస్థాపకుడు లీ చెయోంగ్-గాన్ మాట్లాడుతూ.. ఆర్థోపెడిక్ సమస్యలు, నడక తీరు, శరీర భంగిమను సరిదిద్దడంలో ఫంక్షనల్ ఫుట్‌వేర్ పాత్రపై కొరియన్ అధునాతన మెడిచియో వైబ్రేషన్ చిప్ సాంకేతికతతో సంయుక్త అధ్యయనం చేపడతామని తెలిపారు. అమెరికా ఎఫ్‌డీఏ, యూరప్ సీఈ గుర్తింపు పొందిన ఈ ప్రత్యేక పాదరక్షల పనితీరుపై భారతీయ రోగుల అవసరాలకు అనుగుణంగా క్లినికల్ ఫీడ్‌బ్యాక్ అందించనున్నట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్