రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ విడుదల నేపథ్యంలో ధనుష్ తాజా చిత్రం ‘ఓం’ విడుదల వాయిదా పడింది. తొలుత దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ‘జైలర్’ అక్టోబర్ 15న విడుదల కానున్న నేపథ్యంలో తమ సినిమాను మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధనుష్ తెలిపారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’లో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపావళికి కూడా సినిమాను విడుదల చేయబోమని ధనుష్ స్పష్టం చేశారు. ఆ తేదీకి సూర్య చిత్రం ఇప్పటికే ప్రకటించినందున, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పెద్ద సినిమాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం ఉండాలని భావిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఓం’ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
ధనుష్ 'ఓం` మూవీ విడుదల వాయిదా
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)