శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 2న ‘డోరతీ’

7 గంటల క్రితం

అక్టోబర్‌ 2న ‘డోరతీ’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ నటించిన ‘డోరతీ’ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 2న విడుదల కానుంది. చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. స్వలింగ సంపర్కుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. మలేషియాలో ఈ చిత్రాన్ని నిషేధించారు. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌)లో సెప్టెంబర్‌ 12న ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జ్యోతి దేశ్‌పాండే, గునీత్‌ మోంగా కపూర్‌, అచిన్‌ జైన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్