బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition"ఫాదర్" మూవీ టీజర్ విడుదల

1 గంట క్రితం

FATHER POSTERO FPRAKASHRAJ AND DARLING KRISHNa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డార్లింగ్‌ కృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, అమృత అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫాదర్‌’. ఆర్‌సీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్‌. చంద్రు, యమున చంద్రశేఖర్‌, ఆనంద్‌ పండిట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో తండ్రి (ప్రకాష్‌ రాజ్‌)ను దేవుడిలా కొలిచే కొడుకు కృష్ణ (డార్లింగ్‌ కృష్ణ) కనిపిస్తాడు. కొడుకును అంతగా ప్రేమించే తండ్రి.. అతడిని వదిలి దూరంగా వెళ్లిపోవాలనుకోవడానికి కారణమేంటి? అనే ఆసక్తిని టీజర్‌ కలిగిస్తోంది. ‘గగనపు సూర్యుడే.. వెలుగుల చంద్రుడే.. ధరణికి దేవుడే నాన్నా..’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కుటుంబ కథగా ‘ఫాదర్‌’ తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్