గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్చి 18న ‘ఫౌజీ’ విడుదల?

7 గంటల క్రితం

మార్చి 18న ‘ఫౌజీ’ విడుదల? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ విడుదల వాయిదా పడింది. అయితే ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెలలో సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ రానున్నట్లు సమాచారం. ఆ రోజున టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది మార్చి 18న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటర్వెల్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్