అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ సోమవారం విడుదలైంది. గ్లింప్స్‌ను బట్టి ఎమోషనల్ డెప్త్ ఉన్న అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయకృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
"గోల్డ్ స్పాట్" గ్లింప్స్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)