సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐటి లోహ షేర్లలో ఒత్తిడి

1 గంట క్రితం

it
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెన్సెక్స్‌ 383 పాయింట్ల పతనం

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరగడం తదితర పరిణామాలు భారత మార్కెట్‌లను తీవ్రంగా దెబ్బతీశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సోమవారం సెషన్‌‌లో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. ఐటి, మెటల్, పిఎస్‌‌యు బ్యాంకు, మీడియా షేర్లు భారీగా నష్టపోవడంతో సూచీలు డీలా పడ్డాయి. ​సెన్సెక్స్ చివరికి 382.62 పాయింట్లు లేదా 0.5 శాతం కోల్పోయి 76,132.81 కు పరిమితమయ్యింది. ఇక నిఫ్టీ50 సూచీ కూడా 118.55 పాయింట్లు లేదా 0.5 శాతం నష్టపోయి 23,779 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టిసిఎస్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని అధిక నష్టాలను చవి చూడగా.. మరోవైపు ఎల్‌అండ్‌టి, భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండిగో షేర్లు అధికంగా లాభపడ్డాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్