శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడలింగ్‌ వల్లే నటినయ్యా : కృతి సనన్‌

1 రోజు క్రితం

kruthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరోయిన్‌గా మారాలని తాను మొదట్లో అనుకోలేదని నటి కృతి సనన్‌ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ.. తనకు మోడలింగ్‌పై కూడా ఆసక్తి లేదని చెప్పారు. “నాకు మోడల్‌ అవ్వాలనే ఉద్దేశం లేదు. కానీ నన్ను చూసి కొందరు మోడలింగ్‌ ప్రయత్నించమని సలహా ఇచ్చారు. నేను కూడా ఓసారి ట్రై చేసి చూద్దాం. మోడలింగ్‌ కాకపోయినా.. ఆ అనుభవమైనా ఉంటుందనుకున్నాను. ఓసారి నా సోదరి అనుకోకుండా తీసిన నా ఫొటోలను కొన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాను. వాటిని చూసి నన్ను మోడల్‌గా ఎంపిక చేశారు. నేను మోడలింగ్‌ చేస్తానన్నప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. ‘శ్రద్ధగా చదువుకుంటున్నావు. మోడలింగ్‌ వైపు వెళితే.. చదువుకోలేవు’ అని అన్నారు. అయితే అమ్మ మాత్రం సపోర్ట్‌గా నిలిచింది. దాంతో టీవీ ప్రకటనలు చేశాను. అలా చేస్తున్నప్పుడే నటిగా అవ్వాలనిపించింది. మోడలింగ్‌ అవకాశం వల్లే నటినయ్యాను” అని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్