మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుపమతో నటించడం ఆనందంగా ఉంది

2 గంటల క్రితం

అనుపమతో నటించడం ఆనందంగా ఉంది image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 07:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ ఈ నెల 16న దసరా కానుకగా విడుదల కానుంది. బద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నరేశ్‌, తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ ఉడ్డెమారి కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా అఖిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంచి కథలో భాగం కావడానికే ప్రాధాన్యమిస్తానని, పాత్ర నిడివి గురించి ఆలోచించనని చెప్పారు. ‘రౌడీ బాయ్స్‌’ సమయంలో అనుపమతో కలిసి నటించాలని తన తల్లి కోరుకున్నారని, ఇప్పుడు ఆమెతో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. అనుపమ ఇచ్చిన సహకారంతో త్వరగానే సౌకర్యంగా నటించగలిగానని చెప్పారు. ఈ సినిమాలో నరేశ్‌ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, మన ఇంట్లో జరిగే కథలా ప్రేక్షకులకు దగ్గరవుతుందని అఖిల్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్