అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంపై తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత బూసం జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రేక్షకులు సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని, ‘బొమ్మరిల్లు’ తరహా భావోద్వేగాలను పంచుతుందని అన్నారు. బద్రప్ప గాజుల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశామని నిర్మాత చెప్పారు. ఇందులోని పాత్ర కోసం అనుపమ ప్రత్యేకంగా తెలంగాణ యాస నేర్చుకున్నారని వెల్లడించారు. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్ పాటలు రాశారని తెలిపారు. సుమారు 200 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామని, ఆదరణను బట్టి సంఖ్య పెంచుతామని చెప్పారు.
‘బొమ్మరిల్లు’ లాంటి అనుభూతినిస్తుంది
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 06:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)