ముంబయి : ఒక్కోసారి మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయని ప్రముఖ నటి కత్రినా కైఫ్ అన్నారు. ఇటీవల ఆమె బరువు పెరగడంపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ ఎదురైన సంగతి తెలిసిందే. తన బ్యూటీ బ్రాండ్ ‘కె బ్యూటీ’ బ్రిటన్‌లో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు మన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అక్కడ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయని, వాటన్నింటికీ అనుగుణంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తే , మనం ఏ విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేమని అన్నారు . ప్రపంచం మనల్ని ప్రశంసించే సందర్భాలు ఉంటాయని, అలాగే ఒక్కోసారి మనల్ని మనం పోత్సహించుకుంటూ ముందుకు సాగాల్సిన సందర్భాలూ ఎదురవుతాయని, అటువంటప్పుడు మనకు మనమే అభిమానిగా మారాలని అన్నారు.
మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి : కత్రినా కైఫ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)