అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీ రావు, సునీల్, రాంకీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘లెనిన్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున నిర్మించారు. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
‘లెనిన్’ ఓటీటీలోకి ...
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)