పవన్ కేసరి, ప్రాముఖ్య హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం #LUB సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్లపై మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మిస్తున్నారు. మణికంఠ పెదమల్లు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత బీవీఎస్ రవి క్లాప్ ఇవ్వగా, ‘హనుమాన్’ నిర్మాత చైతన్య రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్‌కు దర్శకుడు మణికంఠ దర్శకత్వం వహించారు. దర్శకులు రోహిత్ కెపీ, సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
LUB చిత్ర ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)