హీరో శ్రీనంద్, కమెడియన్ వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'మగాళ్లు జిందాబాద్'. శుక్రవారం ఈ మూవీ టైటిల్ టీజర్‌తో పాటు, ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా లక్ష్మీ నటిస్తోంది. ఈ మూవీని మగాళ్ల సమస్యలపై తీయబోతున్నట్లుగా టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. ప్రముఖ నటుడు అనిల్ రావిపూడి శిష్యుడు నారా ప్రవీణ్ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాతలు ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'మగాళ్లు జిందాబాద్` టైటిల్ టీజర్ విడుదల
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)