బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

10న ‘మండాడి’ విడుదల

1 గంట క్రితం

suhas.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సుహాస్‌, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్‌ కుమార్‌ సమర్పణలో ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్‌పై మతిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మించారు. మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్‌, రవీంద్ర విజయ్‌, మిథున్‌, బాల శరవణన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ విడుదల చేయనుంది. తాజాగా విడుదలైన టీజర్‌లోని డైలాగ్స్‌, బోట్‌ సీక్వెన్స్‌, పడవ పందేల సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఎస్‌.ఆర్‌. కథిర్‌ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్