శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మరకతమణి-2' షూటింగ్‌ పూర్తి

1 గంట క్రితం

'మరకతమణి-2' షూటింగ్‌ పూర్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మరకతమణి-2' చిత్రీకరణ పూర్తయింది. 'ఆ నాణెం దొరికింది.. సాహసం మళ్లీ మొదలవుతోంది.. మరకతమణి-2 షూటింగ్‌ పూర్తయింది' అనే క్యాప్షన్‌తో చిత్రబృందం ఓ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. 2017లో విడుదలై విజయం సాధించిన 'మరకతమణి' చిత్రానికి ఇది సీక్వెల్‌. ఏ.ఆర్‌.కే. శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, నిక్కీ గల్రానీ పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ పతాకంపై సుధన్‌ సుందరం, మనీష్‌ సింఘాల్‌, దుర్గారం చౌదరి, దేవ్‌, కేవీ దురై నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్