పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ‘మయూఖ’ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీతేజ్ ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీతేజ్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఇది హారర్ సినిమా కాదని, కొత్త తరహా థ్రిల్లర్ అని శ్రీతేజ్ తెలిపారు. హీరోయిన్ నివసించే ఫ్లాట్‌లోకి ఓ అపరిచితుడు ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు, హీరోయిన్ పాత్రతో అతడికి ఉన్న సంబంధం ఏమిటన్న అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. విభిన్నమైన కథనం, తెరపై చూపించే విధానం కారణంగా న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి ఉత్తమ థ్రిల్లర్ అవార్డు లభించిందన్నారు. దృశ్య, శబ్ద పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సినిమాను నాణ్యతగా రూపొందించామని, శిబి మాథ్యూ అలెక్స్ మంచి సంగీతం అందించారని పేర్కొన్నారు.
‘మయూఖ’ 9న విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)