బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోలాహలంగా దసరా సాంస్కృతికోత్సవాలు

1 గంట క్రితం

కోలాహలంగా దసరా సాంస్కృతికోత్సవాలు 
- వీధి నాటకాలు, ఫ్లాష్‌‌మాబ్‌, కోలాటాల ప్రదర్శన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వీధి నాటకాలు, ఫ్లాష్‌‌మాబ్‌, కోలాటాల ప్రదర్శన

ప్రజాశక్తి - విజయవాడ : "యువత మేలుకో.. సమాజాన్ని మార్చుకో" అంటూ వివిధ మహిళా సంఘాలు తలపెట్టిన దసరా సాంస్కృతికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల ఉత్సవాలు తొలి రోజు గురువారం విజయవాడ ముత్యాలంపాడు శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం ఆడిటోరియంలో జరిగాయి. వీధి నాటికలు, ఫ్లాష్ మాబ్, కోలాటాల ప్రదర్శనలతో ఆహూతుల్ని మెప్పించారు. పదే పదే కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది. విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని ఉత్సాహంతో గృహిణులు, ఉద్యోగినులు కోలాటాలతో హోరెత్తించారు. ఈ సభకు ప్రముఖ విద్యావేత్త వి సత్యవతి అధ్యక్షత వహిస్తూ మహిళా చైతన్యానికి, మహిళల నిగూఢ శక్తిని వెలికిదీయడానికి.. ప్రత్యామ్నాయ సంస్కృతి అభివృద్ధికి ఎంబివికె ఎంతో కృషిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డా రావి శారద పోటీలను ప్రారంభిస్తూ మహిళలు తమ ప్రతిభను అభివృద్ధిచేసుకునే విషయమై కేంద్రీకరించాలన్నారు. ముఖ్య అతిథి ఫెడరల్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ చైర్మన్ ఎం కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఎంతోకొంత మంచి జరిగేలా ఉత్సవాల లక్ష్యం కావడం సంతోషమన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి అభివృద్ధికి ఇలాంటి ఉత్సవాలు పలు సంస్థలతో కలిసి నిర్వహిస్తున్నామని ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కాట్రగడ్డ స్వరూపరాణి పేర్కొన్నారు. డ్రగ్స్, మత్తుపానీయాలకు అలవాటుపడుతున్న యువకుల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం ఓ కంట కనిపెట్టి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ​న్యాయనిర్ణేతలుగా పి.కవి, కె.వి.రమణ (ఫ్లాష్ మాబ్, వీధి నాటికలు), శ్రీహరికోటి, శివనాగరాజు (కోలాటం) వ్యవహరించారు. సభలో అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్. కొండలరావు, యలమర్తి అప్పారావు, ఎం కృష్ణారెడ్డి, "ప్రస్థానం" సంపాదకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి సీనియర్ గాయకుడు ఎ జగన్ పాడిన అభ్యుదయ గీతాలు ఆహూతుల్ని అలరించాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్