హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారంటూ .... జరుగుతున్న ప్రచారానికి ఆయన అభిమానుల సంఘం తెరదించింది. జూలై 18న నిర్వహించనున్న ‘ఊరు–వాడ’ కార్యక్రమాన్ని రాజకీయ ప్రవేశంగా ప్రచారం చేయడం అవాస్తవమని స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమమేనని వెల్లడించింది. ఈ మేరకు అభిమానుల సంఘం విడుదల చేసిన ప్రకటనలో .... ‘ఊరు–వాడ’ కార్యక్రమానికి చాలా కాలం క్రితమే ప్రణాళిక రూపొందించామని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టి జరుగుతున్న అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మవద్దని కోరింది. అలాగే ఆధారంలేని కథనాలను ప్రసారం చేయకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ప్రచారాల వల్ల అభిమానుల్లో అనవసర అయోమయం నెలకొంటోందని పేర్కొంది. ఈ వివరణతో జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలకు అభిమానుల సంఘం చెక్ పెట్టినట్లైంది. అయితే ఈ అంశంపై ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత దక్షిణాది సినీ ప్రముఖుల రాజకీయ ప్రవేశంపై తరచూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సినీనటుడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారంటూ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సమావేశమైనట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ? క్లారిటీ ఇచ్చిన అభిమానుల సంఘం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)