నెల్లూరు : ఓ హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం పిఎస్‌లో పనిచేస్తున్న మొత్తం 23 మంది సిబ్బందినీ జిల్లా ఎస్పీ అనిత వేజెండ్ల బదిలీ చేశారు. సిఐ మాతంగి శ్రీనివాసరావును విఆర్‌కు పంపారు. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి శ్రీహరి జూన్ 15న కారులో పెంచలకోన వెళ్లి వస్తుండగా మృతి చెందారు. ముందుగా గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత సొంత బావమరిది ఆస్తి కోసం కుక్కలను చంపే ఇంజక్షన్లు ఎక్కించినట్లు వెలుగులోకి వచ్చింది. మొదట హత్య అని చెప్పినా ఆ కోణంలో దర్యాప్తు చేయకపోవడం, కేసును పక్కదోవ పట్టించారనే ఆరోపణలు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినట్లు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
నెల్లూరులో పిఎస్ సిబ్బంది మొత్తం బదిలీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 03:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)