సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మా అనుబంధం ప్రత్యేకం!

1 గంట క్రితం

romanchika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 07:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సందీప్‌ రెడ్డి వంగాతో తన అనుబంధం ప్రత్యేకమైనదని తెలిపారు. ‘సందీప్‌పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. మా బంధం దర్శకుడు, హీరోకు లేదా స్నేహితుల మధ్య ఉండే బంధానికి మించింది’ అన్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా సమయంలో తామిద్దరం ఎంతో ధైర్యంగా ఒక ప్రయత్నం చేశామని, అప్పట్లో డబ్బు, పేరు, ప్రభావం ఏదీ తమకు లేదని గుర్తుచేశారు. ఆ సినిమా కోసం సందీప్‌ కుటుంబం తనపై నమ్మకంతో పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ‘సందీప్‌ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా. నాకోసం సందీప్‌ ఎక్కడిదాకా అయినా వస్తాడు’ అన్నారు. ‘రోమాంచకం’ పెద్ద విజయం సాధించాలని, కొత్త చిత్రబృందానికి మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్