మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోతురాజు ఆహార్యంలో ....

14 ఆగస్టు, 2026

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శ్రీహరి. ఆయన తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఆగస్టు 15న శ్రీహరి జయంతి సందర్భంగా మేఘాంశ్‌ నటిస్తున్న చిత్రం నుంచి చిత్రయూనిట్‌ తాజాగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్‌ను రివీల్‌ చేయలేదు. 50 శాతం షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భైరవకాళి ఫ్లిక్స్‌ బ్యానర్‌పై లెల్లా రాహుల్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్