- వైరల్ అవుతున్న ‘ఫౌజీ’ అవతారం
హైదరాబాద్: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త ప్రొఫైల్ పిక్చర్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. గత ఏడేళ్లుగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొనసాగిస్తున్న ‘బాహుబలి’ డీపీని తాజాగా మార్చేశారు. రాబోయే భారీ చిత్రం ‘ఫౌజీ’ లోని ఇంటెన్స్ లుక్‌తో కొత్త డీపీని అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ప్రభాస్ కొత్త లుక్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ కొత్త అవతారం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ‘ఫౌజీ’ దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కుతున్న భారీ చిత్రంగా ఇప్పటికే అంచనాలు నెలకొల్పగా.. తాజా డీపీతో సినిమాపై చర్చ మరోసారి ఊపందుకుంది. ఇది కేవలం ప్రొఫైల్ పిక్చర్ మార్పు మాత్రమే కాదని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ‘బాహుబలి’తో తన కెరీర్‌లో సృష్టించిన ఓ ప్రత్యేక శకానికి వీడ్కోలు పలికి.. ‘ఫౌజీ’తో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ‘ఎక్స్’ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభాస్ కొత్త లుక్‌పై అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ఈ ఒక్క డీపీ మార్పే ‘ఫౌజీ’పై మరోసారి భారీ హైప్‌ను తీసుకొచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని కీలక అప్‌డేట్స్ లేదా ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








కామెంట్‌లు (0)