శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘బట్వారా’తో ప్రీతి జింటా రీ-ఎంట్రీ

7 గంటల క్రితం

dram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బట్వారా 1947’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ డ్రామాను ఆమీర్‌ ఖాన్‌ తన ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సన్నీ డియోల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, జావేద్‌ అఖ్తర్‌ సాహిత్యం సమకూర్చారు. షబానా అజ్మీ, ఆలీ ఫజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మానవీయ సంబంధాలు, దేశ విభజన నాటి విషాద ఘటనల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రీతి జింటా శక్తివంతమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్