నటి ప్రియా భవానీ శంకర్ ‘ఇరుముడి’ చిత్రంలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. చిన్న వయసులోనే తల్లి పాత్రల్లో నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయని చాలామంది హీరోయిన్లు భావిస్తారు. అయితే కథ నచ్చితే తల్లి పాత్రల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియా భవానీ శంకర్ తెలిపారు. ‘ఇరుముడి’ విజయం సందర్భంగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “తెరపై ఒక బిడ్డకు తల్లిగా నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ నాకు 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగి ఉంటే, ఈపాటికి నిజ జీవితంలో ఒక పాప లేదా బాబు ఉండేవారు. అందువల్ల ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. ఒక నటిగా నాకు పాత్ర కంటే కూడా కథ ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం. కథ నచ్చింది కాబట్టే ఈ సినిమాలో నటించాను” అని చెప్పారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు తొలిసారి చెప్పినప్పుడు తాను ఎంత భావోద్వేగానికి గురయ్యానో.. అదే భావోద్వేగం తెరపై కూడా పండుతుందా లేదా అనే సందేహం ఉండేదని ఆమె తెలిపారు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులకు ఆ భావోద్వేగం కనెక్ట్ అయిందని, అందుకే ఈ సినిమా విజయం సాధించిందని చెప్పారు.
కథ నచ్చితే తల్లి పాత్రకు సిద్ధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)