డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. చిత్ర సమర్పకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “నేను ‘రోమాంచకం’ సినిమా చూశాను. చాలా బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్, వారి స్నేహితుల పాత్రలను చూస్తుంటే సినిమా చూస్తున్నట్లు కాకుండా, పక్కనుంచి వాళ్లను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ఫ్యామిలీతో కలిసి రావాలని కోరుతున్నాను. మ్యూజిక్ కూడా బాగుంది. సినిమా చూస్తున్నంతసేపూ సమయం తెలియలేదు.” అన్నారు.
‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 09:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)