శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంక్రాంతి మనదే : చిరంజీవి

7 గంటల క్రితం

సంక్రాంతి మనదే : చిరంజీవి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ‘సిగ్మా’ ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొన్న చిరంజీవి సినిమా పురోగతిని వెల్లడించారు. ‘‘సినిమా ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయింది. సెకండ్‌ హాఫ్‌ కూడా 30 శాతం అయిపోయింది. ఫస్ట్‌హాఫ్‌కు తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. కచ్చితంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం. పండగ మనదే’’ అని ఆయన అన్నారు. దీంతో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టమైంది. చిత్రబృందం డబ్బింగ్‌ పనులను కూడా ప్రారంభించింది. చిరంజీవి కదిరి కాళిదాస్‌ పాత్రలో నటిస్తుండగా, అనస్వర రాజన్‌ ఆయన కుమార్తెగా కనిపించనున్నారు. నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కెవిఎస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ్‌ నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్