ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పులి వేటలో సత్యదేవ్ - ‘సమవర్తి’ అధికారిక టీజర్ విడుదల

14 గంటల క్రితం

satyadev
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సమవర్తి’ అధికారిక టీజర్ విడుదలైంది. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ ‘మహాదేవ్’ పాత్రలో కనిపించనున్నారు. అడవి నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన ఈ టీజర్‌లో అటవీ సంరక్షణ, అడవుల నరికివేత, గిరిజనుల జీవనం వంటి అంశాలను చూపించారు. సత్యదేవ్ పాత్రను అడవిని, అక్కడి ప్రజలను కాపాడే వ్యక్తిగా పరిచయం చేశారు. టీజర్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా చివర్లో కనిపించే పులి సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ‘రోడ్ టు రిలీజ్’ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తోంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్