శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహేష్ నటన చూసి ఆశ్చర్యపోయా: రాజమౌళి

8 గంటల క్రితం

మహేష్ నటన చూసి ఆశ్చర్యపోయా: రాజమౌళి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ సినిమాపై తాజాగా అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో మహేష్ పోషిస్తున్న 'రుద్ర' పాత్ర గురించి మాట్లాడుతూ.. షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ నుంచి ఉత్తమ నటనను ఎలా రాబట్టాలా అని ఆలోచించానని, అయితే ఆయన సెట్‌లోకి వచ్చిన తర్వాత నటనతో ఆశ్చర్యపరిచారని చెప్పారు. 'దర్శకుడిగా నేను వంద శాతం కష్టపడితే.. నటుడిగా మహేష్ రెండు వందల శాతం శ్రమించారు. ఆయన అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచింది. కథకు సరిపోయే నటుడినే నేను ఎంపిక చేసుకుంటాను. ఈ కథకు మహేష్ సరిగ్గా సరిపోతారని నమ్మి ఆయనను హీరోగా తీసుకున్నాను' అని రాజమౌళి వివరించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్