- ఆసియా కప్ జూనియర్ హాకీ
మాకీ(చైనా): ఆసియా కప్ పురుషుల జూనియర్ హాకీ ఫైనల్లోకి భారతజట్టు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారతజట్టు 3-1తో మలేషియాపై విజయం సాధించింది. ఐదుసార్లు ఛాంపియన్ భారత్ తరఫున కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2గోల్స్ చేయగా.. సుఖ్‌విందర్ మరో గోల్ కొట్టాడు. మలేషియా తరఫున ఏకైక గోల్‌ను ఎం. రాహుల్ చేశాడు. ఇక గ్రూప్ దశలో భారతజట్టు మూడు విజయాలు, ఒక డ్రాతో 10పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరగా.. ఇదే గ్రూప్‌లో దక్షిణ కొరియా జట్టు 3-2గోల్స్‌తో జపాన్‌ను ఓడించి 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరాయి. ఇక గ్రూప్-బిలో పాకిస్తాన్ జట్టు టాప్‌లో నిలువగా.. మలేషియా 2వ స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్, దక్షిణ కొరియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో భారతజట్టు టైటిల్‌కోసం తలపడనుంది.








కామెంట్‌లు (0)