- ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్‌కు ఆరు వంటలకు కనీస మద్దతు ధరల పెంపులో రైతులు కొరుకున్నట్లుగా సి2+50 ఫార్మలా పాటించకుండా అరకొరగా పెంచడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కమిటీ సూచించింది. కేంద్రం కనీస మద్దతు ధరల పేరుతో రైతులను మరోసారి వంచించిందని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోధుమలకు క్వింటాలో పై కేవలం రూ.25 మాత్రమే పెంచారని, ఇతర వంటలైన బార్లీ, శనగలు, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమ వంటల ధరలను A2 ఫార్ములా ప్రకారం పెంచామని ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు. A2 ఫార్ములా రైతులకు నమ్మతం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతాంగ కమిషన్ సిఫార్సుల ప్రతిపాదికన C2+50 శాతం ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ఉండాలని రైతాంగ దీర్ఘకాలికంగా చేస్తున్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
శాస్త్రీయ అంచనాలతో కరువు తీవ్రతను గుర్తించాలి.
రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయమైన అంచనాలతో కరువు తీవ్రత ఉన్న మండలాలను గుర్తించి ప్రకటించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కరువు సాయం చర్యలు చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. కరువు పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉన్నాయని, సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 644 మండలాలలో లోటు వర్షపాతం ఉందని ప్రభుత్వ ప్రతినిధులు ముందుగా ప్రకటించారు. జూన్ 1 నుండి సెప్టెంబర్ 16 రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 476 మిల్లీ మీటర్లకి గాను 218 మిల్లీ మీటర్ల మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఖరీఫ్ సాగు విస్తీర్ణం సాధారణం కంటే 53 శాతం తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020లో సవరించిన కరువు మ్యానువల్ ప్రకారం వర్షపాతం, సాగువిస్తీర్ణము డ్రైస్పెల్, భూగర్భ జలాలు, జలాశయాల నీటి మట్టం, పంట దిగుబడులు వంటి అంశాలు, సాదరంగా పేరా మీటర్స్ కంటే లోటు ఉంటే కరువుగా గుర్తించాలన్నారు. ఉదాహరణకు అల్లూరి జిల్లా పాడేరు జిల్లాలో 9 మండలలో జులై ఆగస్టు వర్షపాతం 21 శాతం నుంచి 63 శాతం లోటు వుంది. సాగు విస్తీర్ణం కూడా 50 శాతం లోటు వుంది అయినా ఆ జిల్లాకు కరువు జిల్లాలో చోటు లభించలేదన్నారు.








కామెంట్‌లు (0)