గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్‌లో తేజ సజ్జ వివాహం

3 గంటల క్రితం

డిసెంబర్‌లో తేజ సజ్జ వివాహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘హనుమాన్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుందని తెలిపారు. నవంబర్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం ప్రత్యేక రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. తనకు కాబోయే భార్య అమెరికాలో పెరిగారని, ఆమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదని తేజ తెలిపారు. ఆమె కుటుంబం సాంకేతిక రంగంలో వ్యాపారం చేస్తోందని, ఆమె కూడా తన తండ్రితో కలిసి అదే రంగంలో పనిచేస్తున్నారని వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్