బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇండియా జాయ్‌-2026కు తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు

4 గంటల క్రితం

ఇండియా జాయ్‌-2026కు తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్‌ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా ఇండియా జాయ్‌-2026 కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ సచివాలయంలో చిత్రరంగ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు, నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి. కళ్యాణ్‌, దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య, హరీశ్‌ శంకర్‌, రాహుల్‌ రవీంద్రన్‌, సాయి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సురేష్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు ఎప్పుడూ సహకరిస్తున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం ప్రపంచస్థాయిలో పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రయత్నించడం ఆనందంగా ఉందన్నారు. ఇండియా జాయ్‌లో లక్ష మందికి పైగా అతిథులు, వందకు పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఓటీటీ సంస్థలు, స్టూడియోల ప్రతినిధులు పాల్గొననున్నారు. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ, సోనీ, అడోబ్‌, యూబిసాఫ్ట్‌ వంటి సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇందులో భాగంగా వీఎఫ్‌ఎక్స్‌ సమ్మిట్‌, కామిక్‌ కాన్‌, ఇండీ గేమ్‌ ఉత్సవ్‌, ఓటీటీ పల్స్‌, ఫిల్మ్‌ మార్కెట్‌, ఏఐ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 8న రెడ్‌ కార్పెట్‌ వేడుక, 9న ఎంఎం కీరవాణి ప్రారంభించనున్న కాన్సర్ట్‌ ఎరీనా ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్