ఇటీవల బీహార్‌లోని జముయి జిల్లాలో టీనేజ్ అమ్మాయిని కొందరు దుండగులు వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై భారత సైన్యంలో మాజీ అధికారి, బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ స్పందించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను కోరారు. నేరస్థులకు శిక్షలు పడనంత కాలం ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా చట్టపరమైన చర్యలు ఉండాలని అన్నారు. నటి అయేషా ఖాన్ కూడా ఘటనను ఖండించారు. మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించాలని ఆమె పిలుపునిచ్చారు.
దోషులకు శిక్ష పడాలి: ఖుష్బూ పటానీ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)